ప్రియదర్శి ఇడుపుకాయితం సినిమా నుంచి ఫోక్ మెలోడీ విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
టాలీవుడ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న తాజా గ్రామీణ నేపథ్య చిత్రం 'ఇడుపుకాయితం'. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'నువ్వు సిన్నబోకే నా శ్రీలత' అంటూ సాగే ఫోక్-మెలోడీ ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సురేశ్ బొబ్బిలి అందించిన బాణీలు, అలరాజు సాహిత్యం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.