రాష్ట్రంలో సాగునీటి రంగంలో నిశ్శబ్ద విప్లవం: పయ్యావుల కేశవ్‌

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో సాగునీటి రంగంలో చాపకింద నీరులా గొప్ప విప్లవం జరుగుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కలెక్టర్ల సదస్సులో తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికత వల్లే వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, పట్టిసీమ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 500 టీఎంసీల జలాలు తరలించి లక్షల ఎకరాలకు స్థిరీకరణ అందించామని, ముఖ్యమంత్రిని ఆంగ్ల పత్రిక వాటర్‌మ్యాన్‌గా అభివర్ణించిందని కొనియాడారు.