పెనుమాకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: సురేష్ స్థలం: పెనుమాక

పెనుమాకలో వినాయక నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై రాళ్లు, కర్రలు, గాజు పెంకులతో దాడికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, భక్తులపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.