భార్యను నరికిన నిందితుడు పోలీసు వాహనం నుంచి దూకి మృతి

రిపోర్టర్: రాము స్థలం: అస్సాం

గువాహటిలో భార్యను దారుణంగా నరికి చంపిన నిందితుడు రామానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా నరకాసుర కొండ వద్ద ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య రియా తాలుక్దార్‌ను హత్య చేసి తలను ఫ్రిజ్‌లో దాచిన ఈ కేసులో అతడు ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు.