ముంబయిలో మానవత్వం: సైకిల్పై డెలివరీలు చేసే యువకుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతి

రిపోర్టర్: శివ స్థలం: ముంబయి

బైక్ కొనే ఆర్థిక స్థోమత లేక సైకిల్పై ఇంటింటికీ తిరుగుతూ డెలివరీలు చేస్తున్న సుజీత్ అనే యువకుడికి ఊహించని కానుక లభించింది. అనంత్ అంబానీ తరఫున ప్రతినిధి ఆయనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను బహుమతిగా అందజేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆ డెలివరీ ఏజెంట్ కంటతడి పెట్టారు. ముంబయికి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.