తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వినియోగంపై మొదటి దశ టెలీమెట్రీ యంత్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.