ఎన్‌డీఏ నిబంధనల వల్ల నా ప్రాణమే పోయేదన్న జానెల్ గ్రాంట్

రిపోర్టర్: మహేష్ స్థలం: World

మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ బాస్ విన్స్ మెక్‌మహాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జానెల్ గ్రాంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీక్రెట్ నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందం తన ప్రాణాలను బలిగొనేంతగా వేధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనెక్టికట్ అలయన్స్ అవార్డు స్వీకరణ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఒప్పందం తన భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పూర్తిగా నాశనం చేసిందని పేర్కొన్నారు.