బీఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలే టార్గెట్‌గా కాంగ్రెస్ బహిరంగ సభలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సిరిసిల్ల

బీఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 30న సిరిసిల్లలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్న ఈ సభను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్ష నేతలకు వారి సొంత గడ్డపైనే సవాళ్లు విసురుతూ కేడర్‌లో జోష్ నింపేలా సీఎం రేవంత్ ఈ వ్యూహం రచించారు.