ఏపీ ఉద్యోగులకు తీపి కబురు: పీఆర్సీ కార్యదర్శిగా లక్ష్మీనరసింహం నియామకం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఏపీలో పన్నెండో వేతన సవరణ సంఘం కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వేల మూడో బ్యాచ్కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనరసింహంను పన్నెండో పీఆర్సీ కార్యదర్శిగా పునర్నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇనావ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని, కమిషనర్ కార్యాలయం పదవీకాలంతో పాటు ముగుస్తుందని సీఎస్ స్పష్టం చేశారు.