ఇళ్ల కూల్చివేతలపై రేవంత్ రెడ్డి సర్కార్‌పై బాధితుడి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఖమ్మం
తెలంగాణలో ఇళ్ల కూల్చివేతల తీరుపై ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పు కోసమే తాము ఓటేస్తే నేడు తమ ఇళ్లను కూల్చివేస్తూ రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నిత్యం శపిస్తున్నారని, ఖమ్మంలోని మంత్రులు కలిసి పేద ప్రజల కడుపు కొడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.