గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: అధికారుల కీలక మార్గదర్శకాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

వినాయక చవితి ఉత్సవాల్లో అనుమతి పొందిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఏపీఈపీడీసీఎల్‌ పకడ్బందీ మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్వాహకులు సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత లోడ్ వర్తిస్తుందని, విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా భద్రతా నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.