అక్షర శ్రీ స్కూల్పై విచారణ జరిపించాలంటూ డీఎస్ఎఫ్ ఆందోళన

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని రామజల్ ఏరియాలోని అక్షర శ్రీ పాఠశాలపై వస్తున్న ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డీఎస్ఎఫ్ కార్యదర్శి బాలు డిమాండ్ చేశారు. శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేస్తూ.. ఫీజుల వసూళ్లు, భవన భద్రత, పారిశుధ్యం తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.