మార్లగుంటలో వీధికుక్కల దాడికి ఒకటో తరగతి బాలుడు తీవ్ర గాయం
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలం మార్లగుంట గ్రామంలో పిచ్చికుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఒకటో తరగతి విద్యార్థి వెంకట మహేంద్రపై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలను కుక్కలు కరవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ వీధికుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.