ఏఐ ట్రెండ్‌కు చెక్ పెట్టిన శశిథరూర్, రేణుకా చౌదరి
రిపోర్టర్: శివ
స్థలం: India
సోషల్ మీడియాలో ఏఐ ద్వారా 80ల నాటి ఫొటోలను సృష్టించే ట్రెండ్ నడుస్తుండగా, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, రేణుకా చౌదరి తమ అసలు పాత ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏఐ అవసరం లేదని, తమ వద్ద ఒరిజినల్ ఫొటోలు ఉన్నాయని పేర్కొంటూ వారు పంచుకున్న చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.