విజయనగరంలో సిద్ధమైన లేబర్ అడ్డా: కార్మికులకు అత్యాధునిక వసతులతో ప్రత్యేక కేంద్రం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

కార్మికుల సంక్షేమం కోసం విజయనగరం జిల్లా సంతపేట సమీపంలో లేబర్ అడ్డా కేంద్రం సిద్ధమైందని కార్మిక సంక్షేమ శాఖ ఉప కమిషనర్ సుజాత తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రారంభోత్సవం ఆగిందని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని ఆమె వెల్లడించారు. ఈ కేంద్రంలో టీవీ, ఏసీ, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్ వంటి సదుపాయాలు ఉంటాయని, 24 గంటలూ తెరిచి ఉంటాయని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతోందని ఆమె స్పష్టం చేశారు.