పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాకలోని సువిధ హాస్పిటల్ లో డాక్టర్ స్రవంతి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిరి శివప్రసాద్, 65వ వార్డు క్లస్టర్ ఇంచార్జ్ దాట్ల శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు, మహిళా ప్రధాన కార్యదర్శి లకోజి రమాదేవి, TNTC ఉపాధ్యక్షులు సుబ్బరాజు తదితరులు పాల్గొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.