కమాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రిపోర్టర్: గోపి స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార నాణ్యతను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిని, వారి భోజన సౌకర్యాలు మరియు ఇతర వసతులపై ఆరా తీశారు.