సిరిసిల్ల గడీల మీద గురిపెడదామంటూ కాంగ్రెస్ శ్రేణుల భారీ ప్రతిజ్ఞ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Telangana

వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడీని బద్దలు కొడదామంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నినాదంతో పిలుపునిచ్చారు. సిరిసిల్ల గడీల మీద గురిపెడదామని, ఫిరంగులమై పేలుదామని పార్టీ కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదే కాంగ్రెస్ కార్యకర్తల అసలైన ప్రతిజ్ఞ అని పేర్కొంటూ తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. రాబోయే రాజకీయ పోరులో ప్రత్యర్థులపై గట్టిగా పోరాడతామని, ప్రజాస్వామ్య బద్ధంగా కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేస్తామని వారు ఈ సందర్భంగా నిబ్బరంగా ప్రకటించారు.