విజయనగరం ఉత్సవాలు: వైభవంగా పైడితల్లి తొలేళ్ల సంబరం, నేడు సిరిమానోత్సవం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి కోట నుంచి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం సిరిమానోత్సవం ప్రారంభం కానుందని దేవస్థానం ఈవో శిరీష వెల్లడించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.