భారీ అంచనాల మధ్య ద ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నైజాం మరియు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా, నైజాం ప్రాంతంలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఏపీలో బుకింగ్స్ ప్రారంభం కానప్పటికీ ఈ స్థాయి స్పందన రావడం విశేషం. రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ ప్రింట్లు పంపడంతో పాటు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తున్నారు.