బీఆర్ఎస్ పార్టీలోకి నల్ల వినయ్ రెడ్డి: గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిర్మల్

నిర్మల్ నియోజకవర్గ రాజకీయాల్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ పంచాయతీ సమితి అధ్యక్షుడు నల్ల భీమ్ రెడ్డి మనవడు నల్ల వినయ్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.