మంచిర్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రిపోర్టర్: శివ
స్థలం: పెద్దపల్లి
మంచిర్యాల నియోజకవర్గంలో మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. మంచిర్యాల శ్రీరాంపూర్ ఆరో డివిజన్లో దీర్ఘకాలంగా వేధిస్తున్న రోడ్డు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. నేషనల్ హైవే నుంచి పోచమ్మ గుడి మీదుగా ఎస్సార్పీ-3 ఫ్యాన్ హౌస్ వరకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొంటూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ట్వీట్ చేశారు.