హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం లాబ్రడార్ కుక్క అపహరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వామన్ నాయక్ లేన్‌లో నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న కొంతమంది తాగుబోతులు అత్యంత ప్రియమైన లాబ్రడార్ జాతి కుక్కను దొంగలించి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెంపుడు జంతువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుండగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.