పిఠాపురంలో నాగులాపల్లి మంచినీటి పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Pithapuram
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రూ. 10 కోట్లతో ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లోని 52 ఆవాసాల్లోని 97 వేల మంది ప్రజలకు రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షిత తాగునీరు అందనుంది. ఈ సందర్భంగా కొండెవరం గ్రామంలో కుళాయి ద్వారా అందుతున్న నీటి నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు.