సిగ్మా మూవీ రివ్యూ: సందీప్ కిషన్ తాజా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి అప్పులు తీర్చేందుకు ప్రయత్నించే యువకుడిగా గురు పాత్రలో సందీప్ కనిపించారు. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కథా కథనాలలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని సినీ విశ్లేషకులు తెలిపారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ కోసం ఈ సినిమాను చూసే అవకాశం ఉందని సమీక్షకులు పేర్కొన్నారు.