ప్రజా నాయకుడు పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమంటూ ఖమ్మం కలెక్టర్ నివాళి

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కొనియాడారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.