మార్కెట్లోకి మహింద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ కొత్త వేరియంట్లు విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తన పాపులర్ ఎక్స్యూవీ 3ఎక్స్ఓ లైనప్లో కొత్తగా ఆర్ఈవీఎక్స్ ఎడ్జ్ వేరియంట్ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 9.39 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త సిరీస్ కింద మరికొన్ని పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. మెరుగైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, అధునాతన భద్రతా ప్రమాణాలతో తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వాహనాలను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.