గాంధీజీ ఆశయాలు యువతకు ఎంతో ఆదర్శం: గజపతినగరంలో ఘనంగా జయంతి వేడుకలు
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
విజయనగరం జిల్లా గజపతినగరం కళాశాల మైదానంలో స్ఫూర్తి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బొంతలకోటి శంకర్రావు, విశ్రాంత అధికారులు సత్యారావు, భానుమూర్తి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గాల్లో నడుస్తూ యువత ఉన్నత విలువలను అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శేఖర్, సుధాకర్, దామోదర్ రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించారు.