ముఖ్యమంత్రి చావును కోరుతూ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
రిపోర్టర్: గోపి
స్థలం: Kolkata
ముఖ్యమంత్రి సువేందు అధికారి త్వరగా చనిపోవాలని కోరుతూ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే యూటర్న్ తీసుకున్న కబీర్, సువేందు అధికారి దీర్ఘాయువుతో ఉండాలని కోరుకుంటున్నానని వివరణ ఇచ్చారు. పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారనే ఆవేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.