పారిస్ ఫ్యాషన్ షోలో వినూత్న ప్రదర్శనపై సోషల్ మీడియాలో చర్చ

రిపోర్టర్: రాము స్థలం: Paris

పారిస్ ఫ్యాషన్ వీక్లో 'మటీరియర్స్ ఫెకేల్స్' సంస్థ నిర్వహించిన స్ప్రింగ్ సమ్మర్ 2027 ఫ్యాషన్ షో తీవ్ర చర్చకు దారితీసిందని డిజైనర్లు తెలిపారు. విభిన్న రంగుల మేకప్, సారీని తలపించే డిజైన్లతో ప్రదర్శన నిర్వహించగా నెటిజన్లు భిన్నంగా స్పందించారని నిర్వాహకులు వెల్లడించారు. వలసదారులు, అట్టడుగు వర్గాల వారి గొంతుకగా ఈ కలెక్షన్ను రూపొందించామని డిజైనర్ స్టీవెన్ రాజ్ భాస్కరన్ పేర్కొన్నారు.