టీటీడీ అగరబత్తీల కేంద్రం మూత: నిలిచిన ఉత్పత్తితో భక్తుల నిరాశ

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలోని టీటీడీ అగరబత్తీల తయారీ కేంద్రం మూతపడినట్లు ఎస్వీ గోసంరక్షణశాల సంచాలకులు తెలిపారు. పాత కంపెనీ లీజు గడువు ముగిసి కొత్త టెండర్ల ఖరారులో అధికారుల జాప్యం జరగడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల సుమారు నూట నలభై తొమ్మిది మంది సిబ్బందికి ఉపాధి కరవైందని, భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు.