రూ.కోటి సీఎస్‌ఆర్‌ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల పునరుద్ధరణ: పవన్‌ కల్యాణ్‌

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఏలూరు

ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రూ.కోటి సీఎస్‌ఆర్‌ నిధులతో 25 అంగన్‌వాడీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తామన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సంపద రక్షణ కోసం ప్రాణాలర్పించిన సిబ్బందికి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంలో సంజీవని కార్పస్‌ ఫండ్‌ ద్వారా అటవీ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు.