తెలంగాణలో యూట్యూబర్ హత్య కేసు నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: నిజామాబాద్
తెలంగాణలోని నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ చిట్టారి హరిబాబు హత్య కేసులో నిందితుడు గందం సంతోశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గర్భిణీ అయిన తన సోదరి వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే సంతోశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య వెల్లడించారు. విశాఖపట్నం పారిపోయేందుకు యత్నిస్తున్న నిందితుడిని రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.