గణేష్ నిమజ్జనంలో డీజేలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లిలో గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా డీజేల అనుమతులపై మంత్రి నారా లోకేష్ పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. నిబంధనల ప్రకారం మాత్రమే డీజేలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేడుకలు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆయన కోరారు.