రంజీ ట్రోఫీ: తొలి రోజు ముంబైని కట్టడి చేసిన రైల్వేస్ బౌలర్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ డి మ్యాచ్ లో రైల్వేస్ బౌలర్లు విజృంభించారు. బ్రాబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై తొలి రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. అంకు్రిశ్ రఘువంశీ 78 పరుగులు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 55 పరుగులతో రాణించారు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సింగ్ మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు.