కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఐదు ప్రశ్నలు సంధింపు

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ నిష్పాక్షికతపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన కాంగ్రెస్ కు ఐదు సూటి ప్రశ్నలు సంధించారు. యూపీఏ హయాంలో ఎన్నికలు జరిగితే నలభై నాలుగు సీట్లు ఎలా వచ్చాయని రిజిజు నిలదీశారు. బీజేపీ అనుకూలంగా ఉందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.