స్థానిక సంస్థల పోలింగ్ పూర్తి: స్ట్రాంగ్ రూములకు బ్యాలెట్ బాక్సులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూములకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రానికి ముగిసింది. విజయవాడలో కొద్దిపాటి సాంకేతిక సమస్య మినహా అన్ని ప్రాంతాల్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.