రాత్రివేళ నడుచుకుంటూ వెళ్తున్న దంపతులకు సాయం చేసిన ఏలూరు పోలీసుల తీరు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఏలూరు

రాత్రివేళ రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను అత్యాధునిక డ్రోన్ ద్వారా గుర్తించినట్లు Eluru Police వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే స్థానిక పోలీసులు స్పందించి ప్రత్యేకంగా ఆటోను ఏర్పాటు చేసి వారిని క్షేమంగా సురక్షితంగా ఇళ్లకు చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా రాత్రి సమయాల్లోనూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నామని, ఆపదలో ఉన్నవారికి తక్షణమే అండగా నిలుస్తున్నామని అధికారులు తెలిపారు.