తిరుమలలో ఘనంగా చిన్నశేష వాహనసేవ.. అలరించిన కళాప్రదర్శనలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చిన్నశేష వాహనసేవ వైభవంగా జరిగింది. మలయప్పస్వామి దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.