పురుషోత్తపురంలో అత్యధిక ధర పలికిన గణనాథుడి లడ్డు ప్రసాదం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సరుబుజ్జిలి
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో గణనాథుడి ప్రసాదం రూ. 33 వేలకు అంపోలు సూర్యం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.