క్రీడా ప్రాంగణంలో ప్రతిభను చాటి జిల్లా స్థాయికి ఎగిరిన బాలకెరటాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భువనగిరి

భువనగిరి మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో యు.అక్షిత 600 మీటర్ల పరుగు పందెంలో, బి.రాకేష్ లాంగ్జంప్లో ప్రథమ స్థానాలు సాధించారు. అండర్-17 విభాగంలో టి.శిరీష షాట్పుట్లో ద్వితీయ స్థానం సాధించగా, కబడ్డీలో ఆర్.ధనుష్, బి.రుతిక్, ఐ.జస్వంత్ విశేష ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయకేతనం ఎగురవేసిన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర యాదయ్య మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.