యువత ఆధ్వర్యంలో డాక్టర్ రామ్మోహన్‌కు ఘన సన్మానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పత్తికొండ
పత్తికొండ పట్టణంలోని మడ్డిగేరి ప్రాంతంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా గని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్‌ను గని యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. యువత ఐక్యతతో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.