నరసరావుపేటలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు ప్రాంతంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులు మరియు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పల్నాడు జిల్లా పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంటూ పల్నాడు పోలీసులు అధికారికంగా వివరాలు పంచుకున్నారు. ఈ ఆపరేషన్లో పలు కీలక అంశాలపై ఆరా తీశారు.