తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి నియామకం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. అలాగే మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులకు కూడా వివిధ హైకోర్టుల సీజేలుగా పదోన్నతులు కల్పిస్తూ కొలీజియం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.