సైమా వేదికపై రోషన్, శ్రీదేవి అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్న సైమా అవార్డ్స్ 2026 వేడుకలో 'కోర్టు' సినిమా జోడీ రోషన్, శ్రీదేవి తమ అద్భుతమైన నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. వేదికపై వీరిద్దరి ఉత్సాహభరితమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.