రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పురపోరు: 60.96 శాతం పోలింగ్ నమోదు
రిపోర్టర్: రమేష్
స్థలం: Amaravati
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 79 పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీలకు ఆదివారం ఉత్కంఠభరిత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 60.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పోలిస్తే ప్రధాన నగరపాలక సంస్థలలో ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా తిరుపతిలో అత్యల్పంగా సగం మంది కూడా ఓటేయకపోగా, విశాఖపట్నంలోనూ పోలింగ్ శాతం అతికష్టం మీద అర్ధసెంచరీ దాటింది. ఇక మున్సిపాలిటీలలో అత్యధికంగా చీమకుర్తిలో 84.36 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.