ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం మరియు అధికారుల అప్రమత్తత
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు.