ప్రధాని మోదీ ఆయురారోగ్యాలకై కిర్లంపూడిలో బీజేపీ నేతల ప్రత్యేక పూజలు

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని కిర్లంపూడిలో మండల బీజేపీ అధ్యక్షుడు శరకణం రాజబాబు ఆధ్వర్యంలో సంతమర్కెట్లోని వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. మోదీ దీర్ఘాయుష్షుతో జీవించి విశ్వగురు భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పూజారి ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు గంధం దుర్గాప్రసాద్, మల్లయ్య, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు బుద్ద పెదకాపు, కార్యకర్తలు పాల్గొన్నారు.