వికారాబాద్ అడవుల్లో వన్యప్రాణుల కోసం అత్యాధునిక ట్రాక్ కెమెరాలు ఏర్పాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: వికారాబాద్

వికారాబాద్ జిల్లా అడవులలో వన్యప్రాణుల కదలికలను నిరంతరం పసిగట్టేందుకు అటవీ అధికారులు అత్యాధునిక ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పార్గీ, కొడంగల్, ధారూరు, తాండూరు ప్రాంతాల్లో జంతువుల సంచారాన్ని గుర్తిస్తూ ఈ నిఘా నేత్రాలు భరోసా ఇస్తున్నాయి. డీఎఫ్ఓ బత్తుల విశాల్ మరియు రేంజ్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 16 ట్రాకింగ్ కెమెరాలను బిగించారు. రాత్రి వేళల్లో సైతం ప్రతి కదలికను రికార్డు చేస్తూ వన్యప్రాణుల సంరక్షణకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.