గర్భిణిపై దాడి కేసు కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బెంగళూరు
గర్భియైన మహిళ పొత్తికడుపుపై దాడి చేసిన కేసులో నిందితులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన గాయాలు కాలేదన్న కారణంగా హత్యానేరం సెక్షన్‌ను తోసిపుచ్చలేమని జస్టిస్ అనంత రామనాథ హెగ్డే నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిందితులు దాడి చేయలేదన్న వాదనను బాధితురాలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఈ అంశంపై విచారణలో పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని కోర్టు పేర్కొంది. గర్భిణి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నంత మాత్రాన దాడి జరగలేదని అనలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.